Home  »  TV News  »  ప్రేమి విశ్వనాథ్‌పై కొడుకు మను ప్రశంసలు!

Updated : Jun 29, 2026

కార్తీక దీపం వంటలక్క అంటే చాలు నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ కి ఆమె పేరు పాకిపోయింది. ఇక ఇప్పుడు కార్తీక దీపం 2 సాగుతోంది. వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ కొడుకు మను అమెరికాలో ఉంటున్నాడు. రీసెంట్ గా ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో శ్రీముఖి అమెరికాలో ఉన్న మనుకి కాల్ కనెక్ట్ చేసింది. ఇక మనుతో ముచ్చట్లు పెట్టింది శ్రీముఖి. వంటలక్క ఈ శారీలో చాలా అందంగా ఉంది అంటూ మెచ్చుకున్నాడు మను. ఇక వంటలక్క గురించి తెలియని విషయాల ఏమైనా ఉంటే చెప్పమని అడిగింది శ్రీముఖి.

"అమ్మ బాగా వంటలు వండుతుంది. నేను చాలా వంటలు మిస్సవుతున్న. చేపల కూర, చికెన్  ముఖ్యంగా మిస్సవుతున్నా. నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. మీరంతా కూడా ఒక రోజు ట్రై చేయండి. చాల బాగా వండుతుంది. రియల్ వంటలక్క " అని చెప్పాడు. "లోకల్ కాదు లోకల్ లో ఉంటూ ఇంటర్నేషనల్ ఆటలు ఆడుతున్నాం. ఆదివారం విత్ స్టార్ మా పరివారం అంటే లోకల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ " అని చెప్పింది శ్రీముఖి.

" మీ అమ్మకి ఫోన్ పిచ్చి ఉందా లేదా " అని అడిగింది. "లేదు. నేను ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయదు." అని చెప్పాడు. "సెట్ లో కూడా అందరికీ తెలుసు నేను ఫోన్ ఎక్కువగా వాడను" అని చెప్పింది వంటలక్క. "మీ అమ్మ చాల స్ట్రిక్ట్ గా ఉంటారా " అని అడిగింది. "నో. చాల ఫ్రెండ్లీగా ఉంటుంది. నేను ఏ విషయం గురించైనా మా అమ్మకు చెప్పగలను." అన్నాడు. " మీ అమ్మ ఎప్పుడైనా కొట్టిందా" అని అడిగింది. "ఒకసారి నేను కొంచెం పెద్దయినప్పుడు చీపురు కట్ట పెట్టి కొట్టింది. "అసలు మీరు మనుని కొట్టటానికి ఏఏ వస్తువులు వాడారు " అని శ్రీముఖి వంటలక్కను అడిగింది. "చీపురు కట్ట, చెప్పులు" అని చెప్పింది. "మను ఇదా కారణం నువ్వు ఇండియా వదిలేసి అమెరిక వెళ్ళిపోయింది " అంటూ శ్రీముఖి అడిగింది. "అయ్యుండొచ్చు " అన్నాడు మను కూడా.

"చిన్నప్పుడు ఎం చేసాడని కొట్టారు " అని శ్రీముఖి అడిగింది. "చిన్నప్పుడు చెప్పింది వినరు అలా తిరుగుతూనే ఉంటారు. చాల ఉన్నాయి వాడు చేసిన అల్లరి పనులు.  నాకు కోపం ఎక్కువ. అందుకే ఆ చిరాకంతా వాడి మీద చూపిస్తూ ఉంటా " అని చెప్పింది వంటలక్క. "కార్తీక దీపం సీరియల్ చూస్తావా" అని అడిగింది. "నిజం చెప్పాలంటే మా అమ్మ వచ్చే రోల్ వరకు చూస్తా " అని చెప్పాడు. " డాక్టర్ బాబు ఇక్కడే ఉన్నారు మాట్లాడతావా " అని అడిగింది శ్రీముఖి. "హాయ్ నిరుపమ్ గారు ఎలా ఉన్నారు. అమ్మ ఎప్పుడూ చెప్తుంది మీరు సన్నగా ఉండడానికి కారణం మీరు తెచ్చుకునే చిన్న క్యారేజ్ బాక్స్ అని. అమ్మ ప్రతీ ఒక్కరి గురించి చెప్తుంది . "మను మీ అమ్మను హీరోయిన్ గా చూడాలి అనుకుంటే ఏ హీరో పక్కన చూడాలనుకుంటున్నావ్ " అని అడిగింది శ్రీముఖి. "ప్రభాస్ " అని చెప్పాడు మను. నాకు టు ఒప్షన్స్ ఉన్నాయి నిజానికి ఈ ప్రశ్న అడిగేసమయానికి నాకు ప్రభాస్ పేరు వచ్చింది. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ ని. నిజానికి అల్లు అర్జున్ తో నటిస్తే చూడాలని ఉంది." అని చెప్పాడు. "ఇప్పుడు ప్రభాస్ , అల్లు అర్జున్ ఇద్దరిలో ఎవరితో కలిసి నటిస్తే బాగుంటుంది " అని మళ్ళీ అడిగింది. "అల్లు అర్జున్" అని చెప్పాడు మను. "మా అబ్బాయి వయసు 23. నేనంటే ఇష్టం నాకంటే జిమ్ అంటే ఇష్టం. గర్ల్ ఫ్రెండ్ ని తీసుకుని ఇంటికే వస్తాడు." అని చెప్పింది. అలాగే డాక్టర్ బాబు మీరు జిమ్ కి వెళ్లడం స్టార్ట్ చేయండి అమ్మ పక్కన చాలా చిన్నగా కనిపిస్తున్నారు అని సలహా ఇచ్చాడు.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.